ఇస్రోకు త్వరలో రెండు కొత్త లాంచ్ ప్యాడ్లు
భారతీయ అంతరిక్ష పరిశోధనా క్షేత్రంలో రెండు రెండు అధునాతన ప్రయోగ క్షేత్రాలు ఏర్పడనున్నాయి. త్వరలో రెండు కొత్త లాంచ్ ప్యాడ్ లను ప్రారంభించనున్నామని ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. ఏపీలోని శ్రీహరికోటలో, తమిళనాడులోని కులశేఖర పట్టణంలో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. రెండేళ్లలోపు ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. చంద్రయాన్-4ను 2028లో ప్రయోగిస్తామని, చంద్రునిపై నమూనాలను సేకరించడమే దాని లక్ష్యమని పేర్కొన్నారు.

