ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ లో కీలక పరిణామం
SLBC టన్నెల్లో మానవ అవయవాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. శనివారం రాత్రి కేరళకు చెందిన డాగ్స్ మట్టి లోపల ఉన్నట్లు పసిగట్టాయి. దీంతో మట్టి తొలగింపును చర్యలను ముమ్మరం చేశారు. అక్కడ మనిషి చేయి బయటపడింది. మరింత లోపలికి వెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే టీబీఎం మెషీన్ భాగాలు అందుకు అడ్డంకిగా మారాయి. వాటిని కట్ చేస్తూ మట్టిని తొలగిస్తూ కార్మికుల బాడీల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతానికి ఒకకుడి చెయ్యి, మరో ఎడమ కాలు భాగాలను గుర్తించారు.చేతికి కడియం ఉండడంతో ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం అయ్యుంటుందని భావిస్తున్నారు.