పట్టాలు తప్పిన గూడ్స్
నంద్యాల జిల్లా గాజులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో మహానంది వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వాటన్నింటిని దారిమళ్లించారు.గుంతకల్లు నుంచి విశాఖపట్నానికి నంద్యాల రైల్వే స్టేషన్ మీదుగా ఖాళీ ట్యాంకర్ గూడ్స్ వెళ్తుండగా కొద్ది దూరం ప్రయాణించాక పట్టాలు తప్పింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు గంట పాటు శ్రమించి గూడ్స్‌ను పట్టాలెక్కించారు. గూడ్స్ రైలు పట్టాలపై ఆగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు గంటన్నర పాటు ఆలస్యంగా నడిచాయి. హుబ్లీ నుంచి విజయవాడ వెళ్లే రైలు కాచిగూడ రైలు నంద్యాలలో ఆగి గంటన్నర తర్వాత వెళ్లిపోయాయి. ట్రైన్లు ఆలస్యమవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని నంద్యాల రైల్వేస్టేషన్ అధికారులు తెలిపారు. పట్టాలు తప్పింది గూడ్స్ రైలు కావడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదని రైల్వే సిబ్బంది తెలిపారు.

