రూ.16 కోట్ల ఆస్తులు అమ్మేసిన స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సైలంట్‌గా ముంబయిలోని అత్యంత విలాసవంతమైన ఫ్లాట్స్‌ను విక్రయించారు. వెస్ట్ ముంబయి అంథేరిలో ఉన్న ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లో ఆమెకు సంబంధించిన 4 ప్రీమియం ఫ్లాట్స్‌ను విక్రయించారు. వీటిలో మూడు ఫ్లాట్స్‌ను మూడేసి కోట్లకు, మరో విలాసవంతమైన ఫ్లాట్‌ను రూ.6 కోట్లకు పై ధరకు అమ్మేశారు. ప్రస్తుతం రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కారణంగా గత కొన్ని రోజులుగా ముంబయిలోనే ఉన్న ప్రియాంక ఈ ఫ్లాట్స్ అమ్మకాలను పూర్తి చేసుకున్నట్లు ఇండెక్స్ ట్యాప్ తెలియజేసింది. ఈ చిత్రంలో ఆమె ప్రతినాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఆమెకు ముంబయిలోనే కాక గోవా, న్యూయార్క్, లాస్ ఏంజెలెస్‌లో సొంత భవనాలు ఉన్నాయి. తన భర్త నిక్ జోనస్, కుమార్తె మేరీ చోప్రా జోన్స్‌లతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్నారు.