ఇంజక్షన్ వికటించి ఏడు నెలల గర్భిణీ మృతి..
కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. ఇంజక్షన్ వికటించి ఏడు నెలల గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన మచిలీపట్నం నోబుల్ కాలేజ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో చోటు చేసుకుంది. మల్లేశ్వరి గర్భిణీ జనరల్ చెకప్ నిమిత్తం ఆస్పత్రికి వచ్చింది. ఉమ్ము నీరు తక్కువగా ఉండటంతో టెస్ట్ లు చేసి డా. దుర్గ ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై గర్భిణీ మల్లేశ్వరి మృతి చెందింది. దీంతో ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లనే గర్బిణీ చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని విచారణ చేపట్టారు.