Home Page SliderTelangana

తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు 2025, మార్చి 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 25 వరకు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆలస్యంగా వచ్చే వారికి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వారన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. జిరాక్స్‌ సెంటర్లు, ఇంటర్‌ నెట్‌ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల సందేహాలు పరిష్కరించడానికి నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు.