ఈ పాపం రాష్ట్రాలదే..సుప్రీం ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వల్లే సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య సంరక్షణ దూరమయ్యిందని, ఈ పాపం రాష్ట్రాలదేనని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుబాటు ధరలలో వైద్యం సదుపాయాలు అందజేయడంలో రాష్ట్రప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. వాటి వైఫల్యమే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహంగా మారిందని వ్యాఖ్యానించింది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు రోగులతో బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇలా ఆగ్రహం వ్యక్తం చేసింది.