సివిల్ వివాదాల్లో తలదూర్చి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు
శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఎస్. ఐ .లు గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు.వీరంతా గుంటూరు రేంజ్ కి ఎంపికైన ప్రొబేషనరీ ఎస్సైలు, ఐజీ త్రిపాఠి నూతనంగా పోలీస్ శాఖలోకి అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని హితవు పలికారు.ఇలా చేసి కొంత మంది కొత్త ఎస్సైలు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి పోలీస్ శాఖ యొక్క పేరుప్రతిష్టలను ఇనుమడింప చేయాలని సూచించారు. అనంతరం నియామక ఉత్తర్వులను అందించారు.

