నా చైల్డ్ హుడ్ హీరో అతనే..
పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ భారత ఆటగాడు విరాట్ కోహ్లీని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశాడు. తన చిన్నతనంలో కోహ్లి ఆటను ఆరాధించేవాడినని అబ్రార్ చెప్పుకొచ్చాడు. కోహ్లి తన చైల్డ్ హుడ్ హీరో అని వెల్లడించాడు. అతడికి బౌలింగ్ చేసే అవకాశం దక్కడం అదృష్టమని వివరించాడు. అతడు కేవలం మ్యాచ్ సమయంలోనే క్రికెటర్ గా ఉంటాడని, వ్యక్తిగతంగా చాలా మంచివాడని కోహ్లిని మెచ్చుకున్నాడు. మైదానంలో, బయటా స్ఫూర్తి నింపడంలో కోహ్లి ముందుంటాడని, అదే అతడి గొప్పతనమని అబ్రార్ చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

