Andhra PradeshHome Page Slider

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం..

వివాహేతర సంబంధం వివాహిత ప్రాణం తీసింది. ఈ ఘటన కృష్ణాజిల్లా నిడమానూరులో చోటు చేసుకుంది. నిడమానూరులో దంపతులు ప్రకాష్, కావ్య నివాసిస్తున్నారు. ప్రకాష్ భార్య కావ్య రెయిన్ బో ఆసుపత్రిలో ఆయాగా పని చేసిన సమయంలో వాసు అనే వ్యక్తితో కావ్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంతకాలంగా ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు వాసు, కావ్య కలుస్తుండేవారు. ఈ విషయం భర్త ప్రకాష్ కు తెలిసింది. భార్య కావ్యను మందలించి, ఉద్యోగం మానిపించాడు. దీంతో కావ్య వాసుతో ఫోన్ లో మాట్లాడలేకపోయింది. అయితే.. కావ్య దూరం కావడం వాసు సహించలేకపోయాడు. దీంతో కావ్య ఇంటికి వచ్చి మెడక చున్ని బిగించి వాసు హత్య చేశాడు. భర్త ప్రకాష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.