Home Page SliderTelangana

మీనాక్షి నటరాజన్ తో సీఎం భేటీ..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇంచార్జ్ నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. రైలులో కాచిగూడకు చేరుకున్న ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శాలువా కప్పి స్వాగతం పలికారు. అక్కడి నుండి దిల్ కుషా గెస్ట్ హౌస్ మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. అక్కడ చేరిన కాసేపటికి సీఎం రేవంత్ రెడ్డి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. ఆమె పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. నేడు గాంధీ భవన్ లొ జరగనున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షితోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అలాగే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు సహా పలువురు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలతోపాటు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు.