‘నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చారు’..మమత మండిపాటు
బీజేపీ పార్టీ ఎన్నికల కమిషన్ సహాయంతో ఇతర రాష్ట్రాల నుండి నకిలీ ఓటర్లను పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చుతోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకునేవరకూ ఎన్నికల కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, 294 స్థానాలకు 215 పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.