‘వారికి పదివేల రూపాయల బోనస్’..సీఎం
యూపీలోని మహా కుంభమేళా శివరాత్రితో పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాను చక్కగా నిర్వహించడంలో స్వచ్ఛవారియర్స్ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. 45 రోజుల పాటు ఈ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడడంలో వారు ఎంతో శ్రమించారని ప్రశంసించారు. పగలూ, రాత్రి లేకుండా శ్రమించిన వారి కోసం ఒక్కొక్కరికి రూ. 10 వేలు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గంగా మాతను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉందన్నారు. ప్రధాని మోదీ సంకల్పం వల్లే ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని పేర్కొన్నారు. యూపీలోని కుంభమేళాలో పాల్గొన్న పారిశుద్య కార్మికులకు ఈ బోనస్ త్వరలోనే అందనుంది.