కుప్పకూలిన విమానం.. 46 మంది మృతి
సూడాన్ దేశ రాజధాని ఖార్టూమ్ పట్టణంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నివాసాల మధ్య ఓ సైనిక విమానం కూలడంతో 46 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా.. కర్రారి జిల్లాలోని ఇంటిపై విమానం కుప్ప కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు. మృతుల్లో సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారని వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని స్థానిక యంత్రాంగం ప్రకటించింది.