ప్రభాస్ పేరుతో ఆ దేశంలో ఊరు
హీరో డార్లింగ్ ప్రభాస్ పేరుతో ఒక దేశంలో ఊరు ఉందని తెలుసా..అనుకోకుండా ఈ ఊరి పేరు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్రజల చేతుల్లోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని మారుమూల విషయాలు కూడా అందరికీ తెలిసిపోతున్నాయి. ఒక తెలుగు యూట్యూబర్ నేపాల్‌లో పర్యటిస్తూ, అనుకోకుండా ప్రభాస్ అనే పేరున్న ఊరికి వెళ్లాడు. అక్కడ బోర్డు కనిపించడంతో వెంటనే వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. అయితే ఈ ఊరిపేరు ఎప్పటి నుండో ప్రభాస్ అనే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ చిత్రాల షూటింగులలో బిజీగా ఉన్నారు.

