ప్రయాగ్రాజ్లో ప్రసాదం వడ్డించిన బాలీవుడ్ నటి
ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానం ఆచరించాక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ భక్తులకు ప్రసాదం పంచారు. పరమార్థ్ నికేతన్ ఆశ్రమ్ ప్రెసిడెంట్ స్వామి చిదానంద సరస్వతి, సాధ్వీ భగవతీ సరస్వతితో కలిసి ఆమె పాయసాన్ని వడ్డించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం పట్ల తను కృతజ్ఞత వ్యక్తం చేసింది.ఈ సారి ఇక్కడికి రాగలిగినందుకు చాలా అదృష్టవంతురాలినని కత్రినా కైఫ్ తెలిపింది.