‘ప్రయాగ్‌రాజ్‌కు భరించే శక్తి లేదు’..స్థానికుడి వీడియో
‘ప్రపంచ నలుమూలల నుండి పోటెత్తుతున్న భక్తులను తట్టుకుని, భరించే శక్తి ఇంక ప్రయాగ్‌రాజ్‌కు లేదు. ఇకనైనా రావడం ఆపండి..’ అంటూ స్థానికుడు సోషల్ మీడియాలలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాగ్ రాజ్ పూర్తిగా విధ్వంసకర దశకు చేరుకుందని, గతేడాది ఏర్పాట్ల పేరుతో రోడ్లన్నీ తవ్వేసి, ఫ్లైఓవర్లు వేశారు. ఇప్పుడు విపరీతమైన జనాలతో ప్రయాగ్ రాజ్ నిండిపోయి, చిన్న చిన్న సందులు కూడా కిటకిటలాడుతున్నాయని వాపోయారు. అమృత స్నానాలు ముగిశాయని, ఇంకా ఎందుకు ఇక్కడికి వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నగరమంతా దారుణంగా తయారయ్యిందని, కనీసం మర్యాద లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి దాకా కుంభమేళా పవిత్ర స్నానాలకు 60 కోట్ల మంది పైనే వచ్చినట్లు ముఖ్యమంత్రి యోగి పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరి 26 శివరాత్రి రోజుతో ఈ కుంభమేళా ముగియనుంది.