పాకిస్తాన్‌పై విరాట్ విశ్వరూపం..అనుష్క రియాక్షన్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో సింహభాగం విరాట్ కోహ్లిదే. గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో బాధపడుతున్న విరాట్ నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి, గెలుపుతో పాటు శతకం నమోదు చేసి సంబరాలు చేసుకున్నాడు. విజయం సాధించిన తర్వాత తన సతీమణి అనుష్క శర్మకు సందేశమిచ్చేలా కెమెరాకు కన్నుకొట్టి, తన మెడలోని వెడ్డింగ్ రింగ్‌ను ముద్దాడాడు. ఈ సందేశాన్ని టీవీలో వీక్షించిన అనుష్క తన ఇన్‌స్టా స్టోరీలో విరాట్ విజయాన్ని పంచుకుంది. విరాట్ ఫోటోపై లవ్, హైఫై ఎమోజీలను జత చేసి ఆనందాన్ని పంచుకుంది. ఈ పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది.

