Home Page SliderTelangana

అందరూ చూస్తుండగానే తండ్రిని కత్తితో సంపిండు..

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి(45) ని అతని కుమారుడు సాయి కుమార్ (25) ఇద్దరూ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండటంతో సాయికుమార్ విసిగిపోయాడు. సాయి కుమార్ చాకుతో విచక్షణారహితంగా 10..15 కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికులు సమీపంలో ఉన్న శ్రీకర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.