Home Page SliderTelangana

రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం..

రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల పరిసర ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో ఇప్పటి వరకు ఎండలతో మండిపోయిన ప్రజలకు కొంత మేర ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఉపరితలంలో ఆవర్తనం ఏర్పడి ఈశాన్య దిశగా కొనసాగుతున్నదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం మీదుగా గాలులు వీయనున్నాయని, దీంతో రానున్న వారం రోజులు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.