కేటీఆర్ అండతోనే మర్డర్ : మృతుడి భార్య
కాళేశ్వరం అవకతవకల వ్యవహారంలో రాజలింగమూర్తి కేసు గెలిస్తే తమ ఆటలు సాగవనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య సరళతో పాటు అతడి కూతురు, అన్న కొడుకు ఆరోపించారు. కేటీఆర్ అండతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరుడు హరిబాబు, సంజీవ్, రవి తదితరులు కలిసి ఈ హత్య చేశారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కేసులో రూ.10 లక్షలు తీసుకుని వెనక్కి తగ్గాలని గండ్ర వెంకటరమణా రెడ్డి బెదిరిస్తున్నాడని రాజలింగమూర్తి తనతో చెప్పాడని సరళ వెల్లడించారు. అయితే తాను ఎవరి సొమ్ము తినలేదు.. అన్యాయంపై పోరాటం చేస్తున్నానని తన భర్త చెప్పాడని వివరించారు. హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయబోమని చెప్పారు.

