విషాద యాత్రగా మారిన విహార యాత్ర
సరదాగా విహారయాత్రకు వెళ్లిన వైద్యుల బృందంలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్యరావు (27) మృతి చెందారు. నదిలో నుంచి రెస్క్యూ టీమ్ ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

