ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
కరీంనగర్ మండలం దుర్శేడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో క్షుద్రపూజల కలకలం రేపింది. ప్రధానోపాధ్యాయుడి గది ముందు గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమతో పాటు నిమ్మకాయలను పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు చూసిన భయబ్రాంతులకు గురయ్యారు. ఈ మేరకు ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

