Andhra PradeshBreaking NewsHome Page SliderPolitics

మిర్చి యార్డుకు పోటెత్తిన జ‌నం

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధ‌వారం గుంటూరు మిర్చి యార్డుకు వ‌చ్చారు. జగన్‌ వెంట వైసీపీ ముఖ్యనేతలు వ‌చ్చారు. జగన్‌ రాకతో మిర్చి యార్డుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. మిర్చి యార్డుకు చేరుకున్న జగన్ మిర్చిని పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నాక మీడియాతో మాట్లాడారు వైఎస్‌ జగన్‌. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎలాంటి పర్యటనలకు అనుమతి లేదంటూ మిర్చి యార్డ్‌ అధికారులు తెలిపారు. మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్‌లో వార్నింగ్‌ అనౌన్స్‌మెంట్స్‌ కూడా ఇవ్వ‌డం విశేషం. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్‌ పర్యటనకు దూరంగా ఉన్నారు పోలీసులు.