డీఐజీ వికృత చేష్టలు..
తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి భర్త వేధిస్తున్నాడు. భార్య అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భర్త కిరణ్ నెల్లూరు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. కొంతకాలంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు .దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌ను పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నారు.

