మాజీ సీఎంకి బర్త్‌డే విషెస్ చెప్పిన రేవంత్
గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఫేస్ బుక్,ఎక్స్,ఇన్ స్టాగ్రామ్ సహా అన్నీ మాధ్యమాల్లో రేవంత్ ఖాతా నుంచి ప్రత్యేకమైన ఫోటోలతో మాజీ సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ ఆకాంక్షించారు.సీఎం తో పాటు పలువురు మంత్రులు,ప్రముఖులు,వాణిజ్యవేత్తలు,సినీ ప్రముఖులు,కళాకారులు,మేథావులు అంతా కేసిఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.