‘వేలంటైన్స్ డే’ వేళ క్రికెటర్ ఎమోషనల్
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ‘వేలంటైన్స్ డే’ సందర్బంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెడుతూ నువ్వు నీలాగే ఉండు. నీ జీవితాన్ని మార్చే ఛాన్స్ ఇతరులకు ఇవ్వకు అంటూ రాసుకొచ్చారు. దీనితో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. చాహల్ తన భార్య ధనశ్రీతో విడాకులు తీసుకుంటున్నట్లు అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్న వేళ ఇలాంటి పోస్టు పెట్టడంతో అది నిజమేనంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. అతని భార్య డ్యాన్స్ ట్రైనర్ కావడంతో, డ్యాన్స్ నేర్చుకునే క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.

