అనంతగిరి ప్రధాన రోడ్డుపై చిరుత సంచారం
అనంతగిరి అడవిలో వికారాబాద్ నుంచి తాండూర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై చిరుత సంచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం వికారాబాద్ అనంతగిరి అడవిలోనిదే అని డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. వీడియోలో చూపిన ప్రాంతంగా భావిస్తున్న చోట ఫారెస్ట్ అధికారులు రాత్రి గస్తీ నిర్వహించారు. అయితే చిరుత పాదముద్రలు మాత్రం లభించలేదని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.