“ఏఐ వల్ల అలా జరగదు..వదంతులు నమ్మెద్దు”..మోదీ
పారిస్‌లో జరుగుతున్న ఏఐ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఏఐ వల్ల సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. కానీ అందరూ అనుకుంటున్నట్లు ఉద్యోగాలు పోతాయనేది వదంతేనని, యువత ఇలాంటి వదంతులు నమ్మొద్దని పేర్కొన్నారు. ఉద్యోగాలలో నైపుణ్యం పెంచుకుంటూ ముందుకెళ్లాలని ఉన్నతావకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని పేర్కొన్నారు. ఏఐ పరిజ్ఞానంతో వచ్చే వ్యత్యాసం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా కలిసి ముందడుగు వేయాలన్నారు.

