‘ఆయన జయంతి రాష్ట్రపండుగగా జరుపుకోవాలి’..సీఎం
ఏపీ ప్రభుత్వం దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని రాష్ట్రపండుగగా ప్రకటించింది. ఆయన జయంతి ఫిబ్రవరి 14న రాష్ట్రపండుగగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనితో ఆయన సొంతజిల్లా కర్నూలుకు రూ.3 లక్షలు, ప్రతీ జిల్లాకు లక్ష రూపాయల చొప్పున సాంఘిక సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేసింది. 1960, జనవరి 11 నుండి 1962 మార్చి 12 వరకూ సంజీవయ్య అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించారు. తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. అప్పట్లో వృద్ధాప్య ఫించను పథకాన్ని మొట్టమొదట ఆయనే ప్రవేశపెట్టారు. దీనితో ఆయన సేవలను పునస్కరించుకుని ఆయన జయంతిని పండగగా ప్రకటించింది ప్రభుత్వం.

