Andhra PradeshHome Page SliderNews AlertSpiritual

పెన్నుల కోసం పోటెత్తిన భక్తులు..

కోనసీమ జిల్లా అయినవిల్లి వినాయకస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఒక విచిత్రమైన పూజ ద్వారా కొత్తగా వార్తల్లోకెక్కింది. చదువులనిచ్చే గణపతిని లక్ష పెన్నులతో పూజించి, ప్రతీ సంవత్సరం చదువుకునే విద్యార్థులకు పరీక్షల ముందు కానుకగా ఇస్తుంటారు అర్చకులు. ఇలా కొన్ని సంవత్సరాల నుండి జరుగుతోంది. నిన్న ఆదివారం కావడంతో  ఆ పెన్నుల కోసం చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పోటెత్తారు. అయితే తొక్కిసలాటలు లేకుండా, పద్దతిగా క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందేమీ లేకుండానే పెన్నులు పంపిణీ చేయగలిగారు.