సింపుల్‌గా అదానీ ఇంట్లో పెళ్లి..భారీ విరాళాలు..
ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ చెప్పినట్లుగానే తన చిన్నకుమారుడు జీత్ అదానీ వివాహాన్ని చాలా సింపుల్‌గా జరిపించారు. సంపన్నుల ఇంట్లో జరిగే వివాహాలకు భిన్నంగా ఆయన నిరాడంబరంగా సన్నిహితుల సమక్షంలో వివాహం జరిపించారు. కానీ విరాళాల విషయంలో తన పెద్ద మనసు చాటుకున్నారు. భారీగా పదివేల కోట్ల విరాళాలు ఇచ్చి సేవే ప్రార్థన, సాధన, అనే తత్వాన్ని ప్రకటించారు. ఆయన విరాళాలలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య నైపుణ్యాభివృద్ధిలో నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని అదానీ శాంతిగ్రామ్ టౌన్షిప్లో బెల్వెడెరే క్లబ్లో జీత్ అదానీ, వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా వివాహం జరిగింది. ఈ పెళ్లికి రెండు రోజుల పాటు గౌతమ్ అదానీ మంగళ సేవ అనే కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా ప్రతీ సంవత్సరం 500 మంది దివ్యాంగ వధువులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కొత్త దంపతులు సంకల్పించారు.

