News

కాకతీయ యూనివర్సీటీలో ఉద్రిక్తత

హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల వీధి రౌడీల్లా రెచ్చిపోయారు. శుక్రవారం సాయంత్రం వర్సిటీ మెస్‌లో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జూనియర్ విద్యార్థులు సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని తన్నుకున్నారు. ఈ క్రమంలో జూనియర్లను సీనియర్లు చితకబాదారు. ఆపై జూనియర్లు వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకుని ఈ గొడవకు కారణమైన కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది జూనియర్లు, 10 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు.