కాంగ్రెస్‌కి బీజెపికి తేడా అదే….
కాంగ్రెస్ విధానం….ఫ్యామిలీ ఫస్ట్.బీజెపి నినాదం నేషన్ ఫస్ట్.అందుకే ప్రజలు తమకు మూడు పర్యాయాలు ఏకపక్ష తీర్పునిచ్చి కేంద్రంలో కూర్చోబెట్టారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రధాని మోడీ పలు విషయాలకు సమాధానం చెప్పారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్‌లో కాంగ్రెస్‌కు వస్తున్న ఇబ్బంది ఏంటో అర్థంకావడం లేదని చురకలంటించారు.దేశ ప్రజలందరికి సేవ చేసేందుకు తామంతా సభలో ఉన్నామన్నారు.మూడోసారి దేశ ప్రజలు తమకు అవకాశం ఇచ్చారన్నారు.ఇంతపెద్ద దేశంలో తమకు మూడోసారి అవకాశం దక్కిదంటే అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ కాలం దేశాన్ని కాంగ్రెస్ పాలించిందని గుర్తుచేశారు. ఆ కాలంలో మరో విధానం గురించి ఆలోచించిన పరిస్థితి లేదని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. ప్రజల కళ్లకు గంతలు కట్టి తమ అధికారాన్ని కాపాడుకున్నారన్నారని ఎద్దేవా చేశారు. బీజెపి హయాంలో సమయమంతా దేశ ప్రజల ప్రగతి కోసం వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు.కేవలం అర్హులకే లబ్ధి చేకూరేలా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాం అని చెప్పారు. పదేళ్లలో సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ మార్పును గమనిస్తున్నామని.. ఎస్సీ, ఎస్టీలను బలోపేతం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.