10 కేజీల బంగారం పట్టివేత
దేశ రాజధాని ఢిల్లీలో స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.ఎంత నిఘా పెట్టినా అక్రమంగా మాదక ద్రవ్యాలు,బంగారం,ఇతర విలువైన ఆభరణాల దేశంలోకి కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి తరలిస్తూనే ఉన్నారు. గురువారం తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుకున్నారు. రూ. 7.8 కోట్ల విలువైన 10 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. మిలాన్ నుంచి వచ్చిన ఇద్దరి ప్రయాణికుల బ్యాగ్లో బంగారం గుర్తించారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కశ్మీర్కు చెందిన ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్, కేసు నమోదు చేశారు.

