బీ అలర్ట్.. నార్సింగిలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ – నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళ మెడలోంచి చైన్ స్నాచర్ బంగారు గొలుసును లాక్కెళ్లాడు. దీంతో ఆమె కిందపడటంతో గాయాలయ్యాయి. . బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ వద్ద వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచర్ గొలుసు లాక్కెళ్లిప్పుడు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

