‘కాంగ్రెస్ కనిపిస్తే కొడతారు’..కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చాలా రోజుల తర్వాత నోరు విప్పారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ఆయన తన ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కాంగ్రెస్ నాయకులు కనపడితే కొట్టేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. చాలా కాలంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. ఎక్కడి ప్రాజెక్టులక్కడే పడకేశాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. కేవలం ఏడాది కాలంలోనే సర్కారుపై వ్యతిరేకత ఏర్పడింది. సోషల్ మీడియాలో ఏ పార్టీ రావాలని ఓటింగ్ పెడితే.. బీఆర్ఎస్ పార్టీయే కావాలని జనం ఓట్లేశారు. నేను కొడితే మామూలుగా ఉండదు. గట్టిగా తగులుతుంది. వచ్చే నెలలో భారీ బహిరంగ సభ పెడతాం అంటూ పేర్కొన్నారు.