ఇది విజయోత్సవ సభలా ఉంది
మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ … పరిపాలనలో అన్ని విధాలుగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నల్లగొండ జిల్లాలో రైతు ధర్నాలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పాలకులపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ లో విద్యార్థులు గొడ్డు కారంతో అన్నం తినాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఐటీ టవర్ కళ తప్పిందని విమర్శించారు. తన రాక సందర్భంగా నల్లగొండ ప్రజల ఆదరణ చూస్తుంటే.. తాను రైతు ధర్నాకు వచ్చినట్లు లేదని, విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్లు ఉందని అన్నారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి రూ.17,500 బాకీ పడిందని తెలిపారు.నల్గొండ ప్రజల కోసం కేసిఆర్ చేయని అభివృద్ది అంటూ ఏదీ లేదన్నారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నంబర్ 1 చేస్తే నల్గొండను రాష్ట్రంలో నంబర్ 1 చేసింది కేసీఆరేనని కేటిఆర్ గుర్తు చేశారు.