ఒకే ఒక్క క్లిక్ తో రూ.1.32 కోట్ల సఫా
వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క అన్ వాంటెడ్ మెసేజ్ అమె జీవితాన్నే మార్చేసింది.దర్జాగా జల్సా చేస్తూ ఎంతో హ్యాపీగా గడుపుతున్న లగ్జరీ లైఫ్ కాస్త కుదేలయ్యింది. సాపీగా సాగుతున్న జీవితం కాస్త కుదుపుకు గురయ్యింది.దీంతో రోడ్డు మీద రుయ్ ..రుయ్ అంటూ కార్లో తిరిగే ఆ మహిళ చివరికి రోడ్డున పడింది. కేరళలోని తిరువనంతపురం జిల్లా శ్రీకార్యం ప్రాంతానికి చెందిన 57 ఏళ్ల మహిళ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కోసం ఇంటర్నెట్‌లో వెతకసాగింది.ఈ క్రమంలో తన వాట్సాప్ నంబర్‌కి ఓ మెసేజ్ వచ్చింది.వెంటనే క్లిక్ చేసింది.ఇంకేముంది క్షణాల్లో ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1.32 కోట్లు మాయమయ్యాయి.రెండు రోజుల తర్వాత తేరుకున్న మహిళ….ఓహో ఇది దాని పనే అంటూ నిట్టూర్చుకుంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది.దీంతో కేసు నమోదు చేసుకుని సైబర్ మోసగాళ్ల కోసం వేట సాగిస్తున్నారు.