ఢిల్లీ ఎన్నికలలో మధ్యతరగతిని ఆకర్షిస్తున్న ఆప్ మేనిఫెస్టో
రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కళ సంతరించుకుంది. రాజకీయ పార్టీలన్నీ ఉదారంగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టే మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తోంది. వీరి కోసం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు. మధ్యతరగతి ప్రజలకు అతిపెద్ద భారం పన్నులేనని, వారు అధికంగా పన్నులు చెల్లిస్తూ, తక్కువ ప్రయోజనాలు మాత్రమే పొందుతున్నారని పేర్కొన్నారు.
వీటిలో ముఖ్యమైనవి 7 డిమాండ్లు. విద్యా బడ్జెట్ను 2 శాతం నుండి 10 శాతానికి పెంచడం. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ. ఆరోగ్య బడ్జెట్ను 10 శాతానికి పెంచడం, ఆరోగ్య బీమాపై పన్ను తొలగించడం, ఆదాయపు పన్ను మినహాయింపును రూ.7 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగింపు, రైల్వేలో సీనియర్ సిటిజన్లకు తొలగించిన 50 శాతం రాయితీ కల్పించడం వంటి డిమాండ్లతో కేజ్రీవాల్ మేనిఫెస్టోని తయారు చేశారు.