రెండవరోజూ తప్పలేదు
హైదరాబాద్‌లోని సినీ ప్రముఖులపై ఐటీ శాఖ దాడులు, సోదాలు రెండవ రోజు కూడా కొనసాగుతున్నాయి. నిన్నటి నుండి సినీ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాలలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నేడు కూడా దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ బృందాలు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 మూవీ కలెక్షన్లకు తగినట్లు ఆదాయపు పన్ను చెల్లించకపోవడంతో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

