అక్రమంగా పశుమాంసం రవాణ
ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పశుమాంసాన్ని రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బంగా రాష్ట్రం నుంచి విశాఖ మీదుగా హైదరాబాద్ కు అక్రమ మాంసం బ్యాగులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.దాదాపు 6 గంటలపాటు వాహనాలను తనిఖీలు చేశారు.ఈ క్రమంలో భారీ ఎత్తున తరలివెళ్తున్న అక్రమ మాంసం తరలింపు లారీని పోలీసులు గుర్తించారు. 23 వేల కేజీల మాంసం ఉన్న బ్యాగులను పట్టుకుని సీజ్ చేశారు. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

