ఆకాశంలో అద్భుత దృశ్యం నేడే..
నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవబోతోంది. నేటి నుండి కొన్నివారాల పాటు సౌరకుటుంబంలోని ఆరు గ్రహాలు ఒక వరుసలో భూమి నుండి కనిపిస్తున్నాయి. గత వారం నుండి శని, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయి. నేటి నుండి అంగారక గ్రహం, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే సరళ రేఖలోకి రానున్నాయి. ఈ అమరిక వల్ల ఖగోళ పరిశోధకులు, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు ఈ అద్భుతాన్ని అధ్యయనం చేయడానికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. నైరుతి దిశలో శుక్రుడు, శనిని సూర్యాస్తమయం తర్వాత వీక్షించవచ్చు. తూర్పున అంగారక గ్రహం చిన్నగా, బృహస్పతి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు మామూలు కంటికి కనిపించవు. కేవలం టెలిస్కోప్తోనే చూడవచ్చు. భారత దేశంలోని జనవరి 21 నుండి కొన్ని వారాల పాటు కనిపిస్తాయి.

