Home Page SliderTelangana

13 కి.మీ.. 13 నిమిషాలు.. అతివేగంతో గుండె తరలింపు..

గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ కోసం చేపట్టిన ప్రక్రియలో హైదరాబాద్ మెట్రో ముఖ్య పాత్ర పోషించింది. సుమారు 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నిమిషాల్లోనే చేరుకోవడం జరిగింది. ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రి నుంచి దాత గుండెను లక్షీకపూల్ లోని గ్లినిగేల్స్ గ్లోబల్ ఆసుపత్రికి అత్యంత వేగంగా తరలించారు. ఈ రూట్లో ఉన్న 13 స్టేషన్లు దాటి ఇలా అతివేగంగా దాత గుండెను ట్రాన్స్ పోర్ట్ చేయడంలో హైదరాబాద్ మెట్రో రైల్ కీ రోల్ పోషించింది. శుక్రవారం రాత్రి 9.30 నిమిషాల సమయంలో మెట్రో ట్రైన్ ద్వారా దాత గుండెను తరలించారు. సరైన ప్రణాళికతో పాటు సమర్థత, సమన్వయం కారణంగా గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ సఫలమైనట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో అందుకే గుండె తరలింపులో ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో మెట్రో రైలును ఉపయోగించారు.