దొంగతనంపై కరీనా స్టేట్‌మెంట్
సైఫ్ అలీఖాన్‌పై దాడి, తమ ఇంట్లో దొంగతనంపై సైఫ్ భార్య కరీనా స్టేట్‌మెంట్ ఇచ్చారు. తమ ఇంట్లో దొంగతనం జరగలేదని ఆమె తెలిపారు. సైఫ్‌ఖాన్‌ను దుండగుడు చాలా సార్లు పొడిచాడని పేర్కొన్నారు. ఇంట్లో ఎలాంటి డబ్బు, ఆభరణాలు పోలేదని పోలీసులకు వెల్లడించారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిని పోలీసులు ఖండించారు. తాము ఇంతవరకూ ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.