Home Page SliderTelangana

కేటీఆర్ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇదంతా..

కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ కేసులో ఓ వైపు విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ చర్చను పక్కదారి పట్టించేందుకే జడ్జి వద్దకు రావాలంటూ సవాల్ విసురుతున్నారని కౌంటర్ ఇచ్చారు. తాము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోందని చెప్పుకోవడానికే బీఆర్ఎస్ ఇవాళ రైతు దీక్ష చేస్తోందని దుయ్యబట్టారు. పదేళ్లు రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ ఇవాళ రైతుల పేరుతో ధర్నా చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 12 వేల ఆర్థిక సాయం ఈ నెల 26వ తేదీ నుంచి ఇస్తున్నామని గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీని మర్చిపోయిందని విమర్శించారు.