తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ .. భారీగా పోలీసుల మోహరింపు
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందని కార్యకర్తల్లో గుబులు మొదలైంది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. సీనియర్ నాయకులతో కలిసి ప్రతి విషయాన్ని మినెట్ టు మినెట్ ఫాలో చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆఫీసులోని లైబ్రరీ రూం నుంచి కేటీఆర్ లాయర్ రామచంద్రరావు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అరగంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత ఇంటరాగేషన్ ప్రక్రియను పూర్తి చేస్తానమని ఏసీబీ అధికారులు తెలిపారు.