కేటిఆర్ కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే?
ఫార్ములా ఈ కేసు విషయంలో హైకోర్టు ఆర్డర్ లో కొన్ని విషయాలను స్పష్టంగా పేర్కొంది.కేటిఆర్ తన కేసుని క్వాష్ చేయమని మాత్రమే అభ్యర్ధించారని ఆ నేపథ్యలో కుదరదంటూ తీర్పు ఇచ్చామని చెప్పింది.ఈ కేసుకు సంబంధించి అన్నీ విషయాల్లో ఈ తీర్పు వర్తించదని చెప్పింది.కేసు విషయంలో ఏసిబి తీసుకునే నిర్ణయంలో తాము ఏ మాత్రం జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది.దర్యాప్తుకి కేటిఆర్ సహకరించాలని,దర్యాప్తు ముగిసిన తర్వాతనే కోర్టు తీర్పునిస్తుందని పేర్కొంది.