తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీకపూర్
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ తన ప్రతీ సినిమా విడుదలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిసిందే. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి అభిమానులకు కనువిందు చేసింది. ఇటీవల ‘దేవర’ చిత్రంతో అలరించిన జాన్వి తన తర్వాత ప్రాజెక్ట్ ‘పరమ్ సుందరి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదల కాబోతోంది.

