చైనాలో విజృంభిస్తున్న వైరస్..పిల్లులకు కొవిడ్ మందులు
చైనాలో హ్యూమన్ మెటానియమోవైరస్( HMPV) అనే వైరస్ విజృంభిస్తోందని ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రులకు క్యూ కడుతున్నారని పలు వార్తలు వెలువడుతున్నాయి. దీని లక్షణాలు ఫ్లూ లాగే ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తాయి. అంతేకాక ‘ఫీలైన్ కరోనావైరస్’ అనే వైరస్ పిల్లులకు వ్యాపిస్తోంది. ఈ వైరస్ పిల్లి శరీరం అంతటా వ్యాపించే ముందు తెల్ల రక్త కణాలకు సోకుతుంది. దీనికి వాడే మందులు చాలా ఖరీదైనవి కావడంతో వాటికి బదులుగా దీనిపై కొన్ని కొవిడ్ యాంటీ వైరల్ మందులు ప్రభావం చూపిస్తాయని తెలిసింది. దీనితో పెంపుడు పిల్లులు ఉండేవారు ఈ మందులు వాడడం మొదలు పెట్టారు. కానీ మానవులకు వాడే టాబ్లెట్లను పిల్లులకు వాడడం వల్ల వాటి ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

